12-12-2025 12:00:00 AM
తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి
బొంగు వెంకటేశ్ గౌడ్
ఎల్బీనగర్/ అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 11 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను గెలిపించాలని ఓటర్లకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బొంగు వెంకటేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కొత్తగూడెం గ్రామపంచాయతీకి జరిగే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా 10వ వార్డు నుండి పోటీ చేస్తున్న గద్దె రత్నకుమారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు సేవ చేయాలనే సంక ల్పంతో రత్నకుమారి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. చిన్న వయసులోనే భర్త, కొడుకును కోల్పోయినా అన్ని కష్టాలను అధిగమించి ధైర్యంగా నిలబడిందన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలుగా మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా అండగా ఉంటుందని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రత్నకుమారిని గౌను గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు.