12-12-2025 10:32:20 AM
జిల్లాలో మొత్తం పోలింగ్ శాతం : 86.32%
నాగర్ కర్నూల్ ,( విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా సాగింది. తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి ఆరు మండలాల్లో కలిపి మొత్తం 1,81,543 ఓటర్లలో 1,56,710 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వీటితో మొత్తం పోలింగ్ శాతం 86.32% గా నమోదైంది. కల్వకుర్తి:లో 29,857 ఓటర్లలో 26,280 ఓట్లు 88.02% ఊర్కొండ: 16,440 లో 14,751 89.73% వెల్దండ: 32,702 లో 23,919 88.43% వంగూరు: 31,284 లో 26,857 85.85% తాడూరు: 29,639 లో 25,947 87.54% తెలకపల్లి: 41,621 లో 33,956 81.58% పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ బి పాటిల్ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధిక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేశారు. పోలింగ్ సమయం పూర్తయినా, లైన్లో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎన్నికలు ప్రక్రియ పూర్తికావచ్చున అభ్యర్థులు మాత్రం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు మద్యం భారీగా పంచినట్లు ప్రచారం జరిగింది. ఓట్ల లెక్కింపు సమయంలో కూడా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు చోటుచేసుకోకుండా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎన్నికల అబ్జర్వర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.