calender_icon.png 19 February, 2026 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురపోరులో సత్తా చాటిన బీసీలు!

19-02-2026 12:11:15 AM

డాక్టర్ సంగని మల్లేశ్వర్ :

* బీసీలు జనాభాలో మెజార్టీగా ఉన్నప్పటికీ, రాజకీయంగా అన్ని పార్టీలు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సామాజిక న్యాయం సాధించాలంటే రాజకీయ బలం అత్యవసరమని, గుర్తించిన సామాజిక వర్గం ఓటర్లు.. బీసీ ఓట్లు చీలకుండా, బీసీ అభ్యర్థులకే బదిలీ చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా పుర ఎన్నికల ద్వారా రాష్ర్టంలో బీసీలకు రాజకీయ అధికారం రావాలనే ఆకాంక్ష  బలంగా కనిపించింది. 

నిన్నటివరకు తమ జీవితాలను తా ము శాసించుకునే హక్కులేని బీసీలు.. ఇవాళ నగర, పురపాలక సంస్థలను పరిపాలిస్తామని, సమాజాన్ని తామే శాసించబోతున్నామనేది ఫలితాల ద్వారా బహిర్గ తం చేయడం ఒక గొప్ప విషయం. ఇది రా ష్ట్ర చరిత్రలోనే ఒక మహత్తర ఘట్టంగా అభివర్ణించొచ్చు. పురపాలిక ఎన్నికల్లో ఓటర్లు బీసీ అభ్యర్థులకు పెద్దపీట వేశారు. భారత దేశంలో వర ్ణధర్మాన్ని సహజ ధర్మంగా భావిస్తారని, ఈ సహజ ధర్మాల సమాజం మనుషులందరినీ సమానాలుగా గుర్తించదని, ఆ భావజాలమే మన సమాజంలో బ లంగా ఉందనేది ప్రతి ఎన్నికలో స్పష్టంగా కనిపిస్తున్నది.

కులతత్వంతో నేరుగా తలపడవలసిన అవసరాన్ని ఈ సమాజం కట్టబె ట్టింది. అధికారం కోసం అధికారానికి పోరా టం చేస్తే ఆదరించే రోజులు కనుమరుగై పోయాయి. కేవలం ప్రభుత్వం మీద ఆరు గ్యారెంటీల పేరుతో నినదిస్తే సరిపోదనేది ఉప ఎన్నికల సందర్భంగా, పంచాయతీ, పురపాలిక ఎన్నికల సందర్భంగా రుజువు అయ్యింది. సామాజిక న్యాయం కోసం ఆలోచనా సరళిలో మార్పు , ఓటు బదిలీ అయ్యే తీరు బీసీల విజయంగానే భావించవచ్చు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ నాయకత్వంలో జరిగిన పురపాలిక -2026 ఎన్నికలు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పులో విపక్షాలు అధికార పక్షం గాలికి కొట్టుకుపోయాయి. రెండేళ్లుగా రాష్ట్రమంతా ప్రశాంతం గా, ఎటువంటి అసాంఘిక సంఘటనలు లేకుండా సర్వతోముఖాభివృద్ధి చూసి ఈర్ష్య, ద్వేషాలతో కుములుతున్నారు. అధికార దాహంతో ఎడ తెగకుండా ఆరు గ్యారెం టీలపై అర్థరహిత, పింక్ వార్తల ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని, మున్సిపోల్స్‌లో అధికార పార్టీకి జై కొట్టారు. రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం కూడా ప్రతిపక్షాలను కట్టడి చేసింది.  

కాంగ్రెస్‌కు అనుకూలం..

మొత్తం 2,995 అభ్యర్థులకు గాను 113 మున్సి పాలిటీల్లో ఓటర్లు భారీ మెజార్టీని అందించడం మూలానా  92 కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. పురపాలికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు బీఆర్‌ఎస్ పార్టీ కేవలం 18 స్థానాలకు పరిమితమయింది. కాంగ్రెస్ అంటే కేవలం గ్రామీణ పార్టీయేనని.. పురపాలికలు, గ్రేటర్ హైదరాబాద్ లాంటి మహానగరం మాదేనని బీరాలు పలికిన బీఆర్‌ఎస్‌కు తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనాన్ని చూశాక ఎటూ పాలుపోవడం లేదు.

ఇక ఊహించినట్టుగానే కాంగ్రె స్ పార్టీ ఏడింటికి గాను  ఆరు కార్పొరేషన్లను హస్తగతం చేసుకొని విజయదుందుభి మోగించింది. కార్పొరేషన్లలో బీఆర్‌ఎస్ సాధించిన సీట్లను చూస్తే ప్రజలు ప్రజాపాలనపై నమ్మకంతో ఉన్నట్లుగా అనిపిస్తున్న ది. అంతేకాదు సీఎం రేవంత్.. రాబోయే పదేండ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడం కూడా గాలి మాటలు కాదని ప్రజలిచ్చిన తీర్పుతో స్పష్టంగా అవగతమయిం ది. కాగా పురపాలికల్లో ప్రజల తీర్పును చూసి  విపక్షాలు నోరెళ్లబెట్టాయి.

ఎన్నికల సన్నద్ధత అధికార పార్టీకి లాభించిన మరో అం శంగా పేర్కొనవచ్చు. తెలంగాణ పునర్నిర్మాణంలో పట్టణాభివృద్ధి జరుగాలని కాంగ్రెస్ కృషి చేస్తున్నది. పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ సింహభాగం కైవసం చేసుకొని మరో ఎన్నికకు సిద్ధం అవుతున్నది. మొన్న జరిగిన 116 మున్సిపల్, ఏడు కార్పొరేషన్లలో 95 మున్సిపాల్టీలు,6 కార్పొరేషన్లు సా ధించి విజయాన్ని అందుకుంది.

2020లో కేవలం ఐదు స్థానాల్లో ఉన్న కాంగ్రెస్ ఈ రోజు రేవంత్ మార్గదర్శకత్వంలో పీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రులు నిర్విరామంగా కష్టపడడం వల్లనే సాధ్యమయ్యింది. ప్రత్యామ్నాయం కోసం బీజేపీ, బీఆర్‌ఎస్ పోటీ పడినప్పటికీ కార్పొరేషన్లలో బీఆర్‌ఎస్ బోణి కొట్టలేదు, ఇంకా పైగా మున్సిపోల్స్ లో 18 చైర్మన్ పదవులు సాధించిన బీఆర్‌ఎస్.. 2024 పార్లమెంట్ ఎన్నికలకు మున్సిపోల్స్‌కు తమ గ్రాఫ్ కాస్త పెరిగిందన్న విషయం మాత్రమే వారిని సంతోషపెడుతున్నది.

బీసీల ఘన విజయం..

ఇక 116 మున్సిపాల్టీల్లో 70 స్థానాల్లో బీసీలే చైర్మన్‌గా ఎన్నికవడంతో పాటు ఈ ఎన్నికల్లో మొత్తంగా బీసీలు 61 శాతం గెలిచి చరిత్ర సృష్టించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి మినహా అన్ని చోట్ల ‘మేమెంతో మాకంతా’ అనే నినాదం బలంగా పని చేసింది. ఆ మేరకే ఫలితాలు ఉండడం, వైస్ చైర్మన్లుగానూ 42శాతం బీసీలే ఎన్నిక కావడం, ఆన్ రిజర్వుడ్ వార్డులలోనూ 410 మంది బీసీలే విజేతలుగా నమోదవ్వడం కూడా వివిధపార్టీల్లో ఉన్న బీసీ వ్యతిరేకులకు మింగుడు పడని అంశంగా మారిపో యింది.

బీసీలు జనాభాలో మెజార్టీగా ఉన్నప్పటికీ, రాజకీయంగా అన్ని పార్టీ లు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సామాజిక న్యాయం సాధించాలంటే రాజకీయ బలం అత్యవసరమని, గుర్తించిన సామాజిక వర్గం ఓటర్లు బీసీ ఓట్లు చీలకుండా, బీసీ అభ్యర్థులకే బదిలీ చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మొత్తంగా పుర ఎన్నికల ద్వారా రాష్ర్టం లో బీసీలకు రాజకీయ అధికారం రావాలనే ఆకాంక్ష  బలంగా కనిపించింది. 42 శాతం రిజర్వేషన్ అమలుకు స్పెషల్ జీవో తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తాదేమోనని అటు ఢిల్లీ కేంద్రంగా కులగణన చేయకుండా బీజేపీ అడ్డుపుల్ల వేసి కూర్చుంది.  బీసీ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోని ధర్నా దిగడం వల్లనే, మేము సైతం జనగణనతో పాటు కులగణన చేస్తామని ప్రకటించింది.

బీసీ రిజర్వేషన్ల బిల్లు పెండింగ్ ఉండడానికి, పార్లమెంట్‌లో చర్చ లేకపోవడానికి బీజేపీ ప్రధాన కారణమనే అభిప్రాయం తెలంగాణ బీసీ సమాజంలో బలంగా ఉన్నది. రాష్ట్రపతి అమలు చేయకుండా నివారించిందనే ప్రచారం కాంగ్రెస్‌కు బాగా కలిసి వచ్చింది. ఇదే ఎన్నికల్లో రిజర్వేష్లను బహిరంగంగా అడ్డుకున్న బుట్టేంగారి మాధవరెడ్డికి బీఆర్‌ఎస్ మూడుచింతల మున్సిపాలిటీలో టికెట్ ఇచ్చి తనగొయ్యి తానే తవ్వుకున్నట్లయింది. 

కోటా అమలు జరిగేనా?

శాసనసభలో తీర్మానానికి సై కొట్టిన పార్టీల వైఖరి చూస్తే బీసీలను ఓటు బ్యాంకు గా చుశాయే తప్ప రాజ్యధికారం రావాలనే ప్రయత్నం ఎక్కడా కనిపించలేదు, పార్లమెంట్‌లో బిల్లు పై చర్చ జరగాలని  రాజ్యసభ ఎంపీ రవిచంద్ర వాయిదా తీర్మానాన్ని స్వాగతించినా రిజర్వేషన్‌పై మాత్రం ఊసెత్తలేదు. దీంతో బీజేపీ రిజర్వేషన్లకు అనుకూల మనే కపట నాటకం బయటపడింది. ఇక బద్ద వ్యతిరేకిగా ముద్రపడిన మాధవరెడ్డిని బీఆర్‌ఎస్ అక్కున చేర్చుకొని పార్టీ టికెట్ ఇవ్వడం రుచించని బీసీ సామాజిక వర్గం కా రును ఎక్కడా తమ దరి చేరనివ్వలేదు.   

అన్ రిజర్వుడ్ వార్డుల్లో,డివిజన్లలో బీసీలు ఎక్కువగా గెలవడం శుభపరిణామమని చెప్పవ చ్చు. బీజేపీ పట్టణ ఓటర్లలో కొన్ని సీట్లు సాధిస్తామనే ధీమాతో ఉన్నప్పటికీ, కేవలం ఒక మున్సిపాలిటీకే పరిమితం కావడంతో దక్షిణాదిన పాగా వేయాలనే కల చెదిరింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత గ్రే టర్ హైదరాబాద్ స్పూర్తితో కాంగ్రెస్‌కు ప్ర త్యామ్నాయంగా రెండో స్థానంలో నిలుస్తుందని ఆశపడ్డది, ఎన్నికల ముందు ప్రవేశ పెటిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రైల్ కారిడార్ తప్ప, విభజన హామీలను తుంగలో తొక్కి, తెలంగాణకు మొండి చెయ్యి చూపెట్టారనే భావం ప్రజల్లో పెరిగింది.

ఇది కాంగ్రె స్‌కు బాగా కలిసి వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిని చేకూర్చింది. పార్లమెంట్‌లో ఎంపీ ఈటెల రాజేందర్ రిజర్వేషన్ల బిల్లు పెండింగ్ పై ప్రశ్నిస్తే పరిశీలనలో ఉందని కేంద్ర సర్కా రు పూటకో మాట చెప్పడం బీసీ సంఘాల ల్లో ఆగ్రహం రేకెత్తిస్తున్నది. దక్షిణాదిన పాగావేయాలనే బీజేపీ కలలు నెరవేరాలంటే.. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కీలకం. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం తెలిపి బీసీల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరముంది.