calender_icon.png 11 February, 2026 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

11-02-2026 02:54:01 AM

జిల్లా ఎన్నికల అధికారి నారాయణరెడ్డి, పరిశీలకులు మయుంక్ మిట్టల్ 

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 10( విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, చిన్నపాటి పొరపాట్లకు కూడా తావివ్వకూడదని ఎన్నికల సాధారణ పరిశీలకులు మయంక్ మిట్టల్, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఇబ్రహీంపట్నం పరిధిలోని శ్రీఇందు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని వారు సందర్శించి, ఎన్నికల సామగ్రి పంపిణీ తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన ఎన్నికల సామగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం సరిచూసుకున్న తర్వాతే కేంద్రాల నుంచి బయలుదేరాలని సూచించారు.ఉదయం 7:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని,గడువు ముగిసే సమయానికి క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. బ్యాలెట్ పేపర్లు, బాక్సులను క్షుణ్ణంగా పరిశీలించి ప్యాక్ చేయాలి.రీపోలింగ్కు ఆస్కారం లేకుండా, ఓటింగ్ గోప్యతను కాపాడుతూ బాధ్యతగా పనిచేయాలి.

పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రతతో స్ట్రాంగ్ రూమ్లకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నామని మహేశ్వరం డిసిపి తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మరియు ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.