4 April, 2026 | 3:28 PM

Breaking News

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •  

జుక్కల్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

11-02-2026 02:51 AM
  1. సమయం ముగిసినా ప్రచారం చేయడంతో అడ్డుకున్న కాలనీవాసులు 
  2. కామారెడ్డి జిల్లాలో ఘటన

కామారెడ్డి, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ఎన్నికల కోడ్ నిబంధనలను అతిక్రమించి ప్రచారం చేస్తున్నారన్న నెపంతో ఎమ్మెల్యేను  తరిమికొట్టిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు లో చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియడంతో జుక్కల్ ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి బిచ్కుంద మున్సిపాలిటీలో తొమ్మిదవ వార్డులో ఓ ఇంటి లోకి ప్రచారానికి వెళ్లారు. చూసిన ప్రతిపక్ష పార్టీల వారు, వార్డు ప్రజలు  ప్రచారాన్ని అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బిచ్కుందలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున రాత్రి 9 గంటలకు ప్రచారానికి వెళ్లడంతో స్థానికులు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే  పోలీసుల సహకారాన్ని తీసుకొని వెళ్లిపోయారు. నిబంధన లను ఉల్లంగించిన ఎమ్మెల్యేపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు, స్థానికులు డిమాండ్ చేశారు.ర