నూతన చట్టాలపై అవగాహన పొందాలి
26-06-2024 12:50 AM
- లా యూనివర్సిటీ డీన్ బాలకృష్ణారెడ్డి
నాగర్‌కర్నూల్, జూన్ 25 (విజయక్రాంతి): నూతన చట్టాలపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని లా యూనివర్సిటీ డీన్ బాలకృష్ణిరెడ్డి అన్నారు. మంగళ వారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నూతన క్రిమినల్ చట్టాలు, భారతీయ న్యాయ సంహి త, నాగరిక సురక్ష సంహిత గురించి వివరించారు. లింగసమానత్వం, లింగ వివక్షతలను రూపుమాపేం దుకు ప్రత్యేక రక్షణ చట్టాలు చిన్నచిన్న నేరాల విచారణ పద్ధతులను కూడా న్యాయవ్యవస్థలను పటిష్టపరుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, న్యాయవాదులు సురేష్, మదుసుధన్‌రెడ్డి, శివచరణ్ పాల్గొన్నారు.






