15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రోడ్లపై ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి

27-02-2026 12:43 AM

మహబూబ్ నగర్ టౌన్, ఫిబ్రవరి 26: రోడ్లపై ప్రతిక్షణం జాగ్రత్తగా నేర్చుకోవాలని టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ యజాజుద్దీన్ అన్నారు. గురువారం ఎస్.వి డిగ్రీ కళాశాలలో గురువారం మహబూబ్నగర్ జిల్లా టూ టౌన్ పోలీస్ ల ఆధ్వర్యంలో అర్రైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ యజాజుద్దీన్ మరియు పోలీస్ సి బ్బంది కళాశాల విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పిపిటి) ద్వారా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, బాధ్యతాయుత డ్రైవి్ంప అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు లేన్ క్రమశిక్షణ, సరైన విధంగా ఓవర్టేకింగ్ చేయడం, తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనాలలో సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు వంటి అంశాలను వివరించారు. అలాగే నాలుగు సంవత్సరాల పైబడిన పిల్లలకు కూడా హెల్మెట్ అవసరమని తెలియజేశారు.

అదనంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యతను వివ రించి, ప్రమాదాలను ముందుగానే ఊహించడం, వేగ నియంత్రణ, సురక్షిత దూరం పాటించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగాన్ని నివారించడం మరియు వర్షం, పొగమంచు, రాత్రి వేళల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.విద్యార్థులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించడం లక్ష్యంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు విద్యార్థులు ఉన్నారు.