ఉపాధి హామీ పథకం రద్దుకు మోదీ, బీజేపీ కుట్ర
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ
సత్తుపల్లి, ఫిబ్రవరి 26. ( విజయక్రాంతి ): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి ఉపాధి కూలీల పొట్ట కొట్టేందుకు మోడీ బిజెపి ప్రభుత్వం కుట్రలు సాగిస్తుందని, అందులో భాగంగా ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించి జి రామ్ జి పేరుతో ఉపాధి గ్యారెంటీని లేకుండా చేసేందుకు కుట్రలుచేస్తుందని, దీన్ని కాపాడుకునేందుకు కూలీలు పోరాటానికిసిద్ధంగా ఉండాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ
కూలీలకు విజ్ఞప్తి చేశారు . గురువారం సత్తుపల్లి లో జరిగిన విలేకరుల సమావేశంలో 2005లో వామపక్షాల సపోర్ట్ ఏర్పడిన యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం . పథకాన్ని విచ్ఛిన్నం చేసి పథకంలో కూలీలకు ఉపయోగమున్న పని అడిగితే ఇచ్చే డిమాండ్ చట్టాన్ని పూర్తిగా మార్పు ఉన్నారన్నారు.పని ఉంటే ఇస్తావనే చట్టాన్ని తీసుకొచ్చారని ,
దీని వల్ల ఉపాధి కూలీలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఇప్పటికే ఉపాధి హామీ కూలీలకు ఐరిస్ ఫోటోలు పేరుతో రోజుకు రెండుసార్లు ఫోటోలు తీస్తున్నారని, దీనివల్ల ఫోన్ సిగ్నల్స్ రానీ ప్రాంతంలో కూలీలు చేసిన పనికి మాస్టర్లు లేక డబ్బులు రావడం లేదన్నారు. ఈ పథకానికి దేశవ్యాప్తంగా రెండు లక్షల 50 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 80 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
దేశవ్యాప్తంగా కూలీలను పనికి దూరం చేసి, ఇబ్బంది పెట్టే కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా బిజెపి ప్రభుత్వం వచ్చాక ఈ పథకం నిర్వీర్యం చేసేందుకు ప్లాన్ ప్రకారం కుట్రజరుగుతుందని, కరోనాకాలంలో కొట్లాదిమంది కూలీలకు అన్నం పెట్టి, వేసవికాలంలో కూడా కూలీలు ఇబ్బంది పడకుండా పొట్ట గడుపుతున్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నాన్ని తిప్పి కొట్టాల. ఉపాధి కూలీలు ఐక్యంగా పోరాడి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధాతధంగా కొనసాగించే విధంగా పోరాటాలకు సిద్ధం కావాలని దండు పిలుపునిచ్చారు.




