18 April, 2026 | 10:44 AM

వాహనాలతో తస్మాత్ జాగ్రత్త

23-06-2025 12:14 AM

మేడ్చల్ అర్బన్, జూన్ 22: నిత్యం రో డ్డుపై ప్రయాణించేప్పుడు, నడుచుకుంటూ వెళ్లే సమయంలో వాటర్ ట్యాంకర్లు రోడ్డుపై కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు రోడ్డుపై నీ టి సరఫరా ట్యాంకర్లు వెళ్తుంటే వాటి పక్కనుండి వాహనాన్ని నడపడం కాస్త ప్రమాద కరమేనని చెప్పవచ్చు.

అంతేకాకుండా రోడ్డు పై నడిచే సమయంలో పక్కనుండి వాటర్ ట్యాంకర్లు వెళ్ళినప్పుడు పాదాచారులు కాస్త అప్రమత్తతతో ఉండి రోడ్డుపై వెళ్లే వాటర్ ట్యాంకర్ కు దూరంగా ఉంటే బెటర్. గతం లో ఇలా వాటర్ ట్యాంకర్ కుప్పకూలి పాదాచారులు, వాహనదారులు ప్రమాదం బారి న పడి మృతి సంఘటనలు లేకపోలేవు.