17 April, 2026 | 7:24 PM

మండుటెండల్లో జాగ్రత్త

17-04-2026 06:04 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): నిత్యం మండుటెండల్లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ కరీంనగర్ జోనల్ హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా.ఎవి గిరిసింహారావు సూచించారు. ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు, సహాయకులకు, వైద్య సిబ్బందికి, పొరుగు సేవల కండక్టర్లకు వడదెబ్బ తీవ్రత, లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. “వేసవి జాగ్రత్తలు“ కరపత్రాలు ఆవిష్కరించారు. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల వాతావరణం లోహృదయ సంబంధిత వ్యాధులు కలవారు , పిల్లలు,గర్భిణులు, బిపి, షుగర్ కలవారు..నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు