బీసీ మహిళల ప్రాతినిధ్యం లేని బిల్లు వద్దు
కుబీర్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగపరంగా 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సంతోషమైనప్పటికీ బీసీ మహిళా ప్రాతినిత్యం లేని బిల్లును స్వాగతించలేమని, బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకేట పో శెట్టి అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ మహిళలకు 33శాతం రిజర్వేషన్ల కేంద్ర ప్రభుత్వం అమలు జరిపే ఆలోచన మంచిదే ఐన అందులో బీసీ మహిళ ల ఉప కోట ఉండాలనీ, లేకుంటే ఇ బిల్లు ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వనికి మహిళల మీద చిత్త శుద్ధి ఉంటె, జన గణనలో బీసీ కుల గణన చేసిన తర్వాతనే ఈ మహిళా బిల్లును అమలు చేయాలని, డిమాండ్ చేశారు. లేకుంటే బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుందని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, దేశ జనాభాలోనే 60. శాతానికి పైగా ఉన్న బీసీ లపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూపిస్తుంది అని ఆయన అన్నారు. ఇంత వరకు చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటానికి ఎందుకు వెనుకంజ వేస్తుందని, గత 50.సంవత్సరాలకు, పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని, బీజేపీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంటే బీసీ లకు న్యాయం జరుగుతుంది.
ఆశించి కేంద్రంలో 3దఫాలుగా బీజేపీ ప్రభుత్వనికి బీసీ లు ఓట్లేసి గెలిపిస్తే ఇదేనా మీరు బీసీల పట్ల చూపే ప్రేమ, ఇకనైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వనికి బీసీ సంఘాలుగా డిమాండ్ చేసేదేమిటంటే, జనగణలో బీసీల కులగణన చేసి, చట్ట సభలో, ఎస్సీలకు 20శాతం, ఎస్టీలకు 10శాతం, ఇక బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు అమలు చేసి సామాజిక న్యాయం చేయాలని బీవీ సంఘాలుగా మా ప్రధాన డిమాండ్. కేంద్ర ప్రభుత్వం అగ్రకుల పేదలకు 10. శాతం రిజర్వేషన్లు ఏ ప్రాతిపాదికన, అమలు చేస్తున్నారు, మీకు అగ్రకులాలమీద ఉన్న ప్రేమ బీసీల మీద ఎందుకు లేదు అని ఆయన అన్నారు. ఇక నైన బీసీ లకు జనాభా లెక్కల ప్రకారం 60. శాతం రిజర్వేషన్లు చట్ట సభలో అమలు జరిపి, అందులో బీసీ మహిళ అవకాశం కల్పించాలని కోరారు






