17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

05-06-2025 12:00 AM

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ 

మహబూబాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్  లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ వెంకట్ రాములు, డాక్టర్ జగదీష్, డాక్టర్ వెంకట్ లతో కలిసి సీజనల్ వ్యాధులు, టీబి నివారణపై తీసుకోవాల్సిన చర్యలపై కరెక్ట్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దృష్ట్యా జిల్లాలోనీ ప్రజలకు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు సమావేశాలు నిర్వహించాలని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్య, విషజ్వరాల పై పూర్తి అవగాహన కల్పించి, ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో, విద్యాసంస్థల్లో ప్రచారం నిర్వహించాలని, అందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, విద్యాశాఖ, మెప్మా, స్వయం సహాయక బృందాలు, తదితర సాధనాల ద్వారా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమీక్షలో మండల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.