6 July, 2026 | 1:54 AM

ప్రజాస్వామ్య స్ఫూర్తితో సరికొత్త ఆలోచన

04-06-2025 11:48 PM

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్..

హైదరాబాద్ (విజయక్రాంతి): ప్రజాస్వామ్య స్ఫూర్తితో సరికొత్త ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మహిళా పోలీసులతో ‘స్వాట్’ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ‘ప్రజా పాలనలో నిరసనలను పరిగణిస్తాం. నినాదాన్ని అలరిస్తాం. ఆవేదనను పరిష్కరిస్తాం. ఆడబిడ్డలను గౌరవిస్తాం’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రజా సమస్యలపై మహిళలు నిరసన వ్యక్తం చేస్తే.. వారి కోసం సిటీ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహిళల గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా అదుపులోకి తీసుకునేందుకు 35 మంది మహిళా పోలీసులకు 45 రోజుల పాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చారు.