17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

జిల్లాల్లో పనుల పురోగతిపై నివేదికలివ్వాలి

04-06-2025 11:50 PM

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్ అంశాలపై సమీక్ష...

ఉపాధి హామీ, మిషన్ భగీరథ పనులపై మంత్రి సీతక్క ఆరా..

హైదరాబాద్ (విజయక్రాంతి): జిల్లాల వారీగా పనుల పురోగతిపై నివేదికలు సమర్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను మంత్రి సీతక్క(Minister Seethakka) ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనుల పురోగతి, పెండింగ్ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో గ్రౌండింగ్ అయిన పనుల్లో ఎంతమేర పనులు పూర్తయ్యాయి, ఉపాధి హామీ నిధుల ద్వారా చేపట్టిన పనులు, గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ, కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులు ఏ దశలో ఉన్నాయని మంత్రి ఆరా తీశారు. జిల్లాల్లో పర్యటించి జిల్లాల వారీగా పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తానని వెల్లడించారు.