సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
కోదాడ (మునగాల), మార్చి 11: సైబర్ మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ అన్నారు. మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో ప్రజా పాలన ప్రగతి నివేదిక భాగంగా బుధవారం నిర్వహించిన సైబర్ నేరాల అవగాహనా సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. రాష్టంలో అత్యధి కంగా సైబర్ కేసులు మునగాల మండలంలోనే నమోదు అవ్వడం జరిగిందన్నారు. బీనాన్స్ యాప్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, చట్టవిరుద్ధం అన్నారు.
ఆకుపాముల గ్రామంలోనే ఎనిమిది మంది పై సైబర్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. ఆన్లైన్ లో డబ్బులు పంపడం వల్లనే సైబర్ నేరాలు పేరుతున్నాయన్నారు. జిల్లాలో యువత ఈజీ మనీకి అలవాటు పడుతూ సైబర్ నేరాల్లో చిక్కుకపోతున్నారని అన్నారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐలు రా మకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎస్త్స్రలు ప్రవీణ్, అజయ్, ఏడుకొండలు పాల్గొన్నారు.




