15 April, 2026 | 12:27 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నిమ్స్‌లో బీకాన్ 2026 జాతీయ స్థాయి సదస్సు

24-02-2026 12:25 AM

పంజాగుట్ట, ఫిబ్రవరి 23(విజయక్రాంతి): నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, అకాడమీ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో బీకాన్ 2026 పేరుతో భారీ జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ను నిర్వహించనుంది. సంస్థ ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ మాట్లాడుతూ మార్చి 13 నుంచి 15 వరకు బిల్డింగ్ ఎక్సలెన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, క్లినికల్ ఆపరేషన్స్ అండ్ నెట్వర్కింగ్ అనే థీమ్తో ఈ సదస్సు జరగనుంది. ఆరోగ్యశాఖ మంత్రి  దామోదర రాజనర్సింహను ఆహ్వానించామని తెలిపారు.

అనంతరం 14, 15 తేదీలలో బంజారా హిల్స్లోని కుమ్రం భీము ఆదివాసి భవన్లో ప్రధాన సదస్సు జరుగుతుందన్నారు.దేశవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు, పాలసీ మేకర్లు మరియు పరిశోధకులు ఈ వేదికపై హెల్త్కేర్ రంగంలోని సవాళ్లు, ఆధునిక పోకడలపై చర్చించనున్నారని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ పేర్లను www.nimsbea con.com వ్బుసైట్ ద్వారా నమోదు చేసుకోవాలని  సూచించారు. ఆబ్ స్ట్రాక్ట్ సమర్పణ గడువు ముగిసినప్పటికీ ఎంపికైన వారు తమ పేపర్లను మార్చి 5 లోగా అందజేయాల్సి ఉం టుందన్నారు. 8904311484, 8688541111 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.