calender_icon.png 2 June, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ బావిలో పడిన ఎలుగుబంటి..

31-05-2025 06:41:50 PM

మూడు గంటలు శ్రమించి రక్షించిన అధికారులు..

బోథ్ (విజయక్రాంతి): దారితప్పిన ఒక ఎలుగుబంటి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఇబ్బంది పడగా ఫారెస్ట్ అధికారులు 3 గంటల పాటు శ్రమించి రక్షించారు. బోథ్ అటవీ క్షేత్రం(Boath Forest Reserve) పరిధిలోని సాకేర గ్రామ శివారులోని దారి తప్పిన ఎలుగుబంటి వ్యవసాయ బావిలో శనివారం ఉదయం ప్రమాదవశాత్తు జారీ పడిపోయింది. దాని అరుపులకు చుట్టుపక్కల వ్యవసాయ కూలీలు పోగయ్యారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ ల సహాయంతో దాదాపు మూడు గంటల పాటు కష్టపడి చివరికి క్రేన్ సహాయంతో ఎలుగుబంటిని బావిలో నుండి బయటకు తీశారు. బావి నుండి బయట పడ్డ ఎలుగుబంటి దగ్గరలోని అడవిలోకి పారిపోయింది.