calender_icon.png 2 February, 2026 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తంలో బీ ఫామ్‌ల ఫీవర్!

02-02-2026 12:00:00 AM

టికెట్లపై ఉత్కంఠ

ప్రసన్నకోసం తంటాలు

జోరుగా పైరవీలు

బెల్లంపల్లి, ఫిబ్రవరి 1 : బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసిం ది. ఇక బీ ఫాముల గోల పట్టుకుంది. బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ తీవ్రంగానే ఉంది. 34 వార్డుల్లో ఇప్పటి నామినేషన్లు తీరును బట్టి టికెట్ల తాకిడి అధికంగానే కనిపిస్తోంది. ఒక్కో వార్డు నుంచి నలుగురికి పైగానే నామినేషన్లు వేశా రు. ఇక పార్టీ బీ ఫామ్ పై ఆశావాహులు దృష్టి పెట్టారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కేంద్రంగా బీఫామ్ జారీ రాజకీయాలు ఊపందుకున్నాయి. నామినేషన్ ఆఖరికి ఒక రోజు ముందే ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లికి చేరుకున్నారు. నామినేషన్ల చివరి రోజు క్యాంప్ ఆఫీసుకు వెళ్లి ఆయనను ఆశావాదులు ప్రసన్నం చేసుకొని తమ నామినేషన్లు వేశారు. ఈ క్రమంలో ఆశావాహులు ఎవరికి వారే టికెట్ ఖరారు అనే దీమాతో ఉన్నారు.

హామీలు, భరోసాతో నామినేషన్లు..

ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆశీస్సులపై భారం పెట్టీ ఆశావాహులు నామినేషన్ వేశారు. ఎమ్మెల్యేకు, అతని అనుచరులకు అను నిత్యం టచ్ లో ఉంటూ ఆశావహులు టికెట్ కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి బీఫామ్ కన్ఫామ్ అవుతుందో తెలియదు కానీ, అందరూ ఆశలపల్లకిలో ఊరేగుతున్నారు. ఇప్పటికే నామినేషన్ వేసి న ఆశావహులు తమ తమ వా ర్డుల్లో ప్రజలకు తమకే టికెట్టు వస్తుందని చెప్పుకుంటున్నారు.

వార్డుల్లో ప్రజలను కలిసి ఆశీర్వదించాలని ప్రచార సంకేతాలను ఇస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ లభిస్తుందన్న ధీమాతో ఉన్న ఆశావహులకు, టికెట్ నైతిక ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పొ చ్చు. ఒకవేళ అధిష్టా నం బీఫామ్ ఇవ్వకపోతే ప్రజల్లో తమ పరు వు, ప్రతిష్టలు గంగ పాలవుతుందనే ఆందోళన ప్రతి ఒక ఆశావాదు ల్లో కనిపిస్తోంది. బీఫామ్ కన్ఫర్మేషన్ కోసం ఎమ్మెల్యేకు ప్రత్య క్ష, పరోక్షంగా ఆయన కనుసన్నుల్లోనే మెదులుతున్నారు. బీఫామ్ ఇస్తారా? ఎవరా? అని ఆశావాదులు మల్లగుల్లాలు పడుతున్నారు.

గెలుపు గుర్రాలకే టికెట్లు..

మున్సిపల్ ఎన్నికల్లో గెలు పు గుర్రాలకే టిక్కెట్లు కన్ఫామ్ కానున్నాయనీ చెబుతున్నారు. విజయ తీరాలను ముద్దాడే అభ్యర్థు లు ఎవరైనే దానీపైనే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సూత్రప్రా యంగా జాబితా రెడీ చేశారనీ తెలుస్తోంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక లో ఆచీతూచి వ్యవహరిస్తున్నానీ తెలుస్తోంది. ఈ దిశగానే అభ్యర్థుల ఖరారు సాగుతోందని తెలుస్తోం ది.. ఈ ప్రక్రియలోనే ఎమ్మెల్యే గడ్డం వినోద్ మునిగిపోయారనీ తెలుస్తోంది. ప్రజాఆదరణ ఉన్న అభ్యర్థులకు మాత్రమే బీ ఫాము లు ఇచ్చే కోణంలో పరిశీలన,అందు కోసం వడబోతలు చేస్తున్నారు.

ఎలాంటి పైరవీలకు తావు లేకుండా పార్టీ కోసం కమిట్మెంట్ గా పనిచేస్తున్న వారికే బీఫామ్ కట్టబెట్టాలని ఆ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజామోద ముద్రపడిన వారికి మాత్రమే టికెట్ పక్కా అన్న వాదనలు పైకి మాత్రం వినిపిస్తున్నాయి. ప్రలోభాలకు అతీతంగా సరైన అభ్యర్థినే ఎన్నికల్లో దింపాలని ప్రధాన యో చనతోనే ఎమ్మెల్యే ఉన్నారు. అభ్యర్థుల ఎం పికపై సూ క్ష్మ పరిశీలన జరుగుతోందనీ తెలుస్తోంది. ఇదే క్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై కొందరు ఆ పార్టీ సీనియర్ లీడర్లు తమ అనుచరుల కోసం టిక్కెట్లు కోసం ఎమ్మెల్యేపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారనీ తెలుస్తుంది. తమ అనుచరుల టికెట్ కోసం నానా తిప్పలు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో టికెట్లు ఎవరిని వరిస్తాయో తెలియదు కానీ ఆశావహులు మాత్రం గంపెడు ఆశతోఎదురు చూస్తున్నారు. టికెట్ల ఉత్కంఠ ఆశా వహుల్లో నిద్రాహారాలు లేకుండా చేస్తోంది. ఎవరికి బీఫామ్ లభిస్తోందనే టెన్షన్లో కాలం గడుపుతున్నారు. ఇది ఇలా ఉండగా నమ్ముకున్న వారికి టికెటిస్తారా? నట్టేట ముంచు తారా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు ఎమ్మెల్యేకు పెద్ద నైతిక పరీక్ష గా మారిందనడంలో అతిశయోక్తి లేదు. టిక్కెట్ల గోలను ఏ మేరకు సుఖాంతం చేస్తారో చూడాలి మరి.. ఒకటి మాత్రం నిజం.. టికెట్లు కుడి ఎడమ అయితే మాత్రం, కాంగ్రెస్ పార్టీలో పెద్ద రగడనే తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది.