calender_icon.png 2 February, 2026 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్ డ్రాల కోసం బేరసారాలు

02-02-2026 12:00:00 AM

డివిజన్‌కో రేటు.. వార్డుకు మరో రేటు

బీ ఫాంల కోసం అభ్యర్థుల ప్రదర్శనలు

1061 మంది అభ్యర్థుల 1177 నామినేషన్లకు ఆమోదం

మంచిర్యాల, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి రాజుకుంటుంది. స్క్రూటినీ అనం తరం అభ్యర్థులందరు వార్డుల వారిగా ఎంత మంది బరిలో ఉన్నారు, ఆయా పార్టీల నుం చి ఎంత మంది నామినేషన్లు వేశారు, ఇందు లో పార్టీ బీ ఫారంలు సమర్పించిన వారెందరు, ఇంకా ఎంత మందికి బీ ఫారంలు కావాలి, వారంతా ఇండిపెండెంట్లుగా బరిలో నిలబడితే వార్డులో ఏ కాలనీలోని ఎన్ని ఓట్లు చీల్చుతారు, వారిని తమవైపు తిప్పుకుంటే ఎన్ని ఓట్లు ప్లస్ అవుతాయని అభ్యర్థు లు అంఛనాలు వేయడంతో పాటు సొంత పార్టీలో రెబల్ లను విత్ డ్రా చేయించేందుకు వారి దగ్గరి బంధువులతో, స్నేహితుల తో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చుతో పాటు అదనంగా ఫలానా వరకు ఇస్తామని రాయబారాలు నడిపిస్తున్నారు. 

1061 మంది అభ్యర్థుల 1177 నామినేషన్లకు ఆమోదం..

జిల్లాలో 149 డివిజన్, వార్డులకు 1599 నామినేషన్లు రాగా స్క్రూటినీ అనంతరం 1061 మంది అభ్యర్థులకు చెందిన 1177 నామినేషన్లు ఆమోదం పొందాయి. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లకు 362 మంది అభ్యర్థుల 386 నామినేషన్లు ఆమోదం పొందగా ఇందులో కాంగ్రెస్ నుంచి 77 నామినేషన్ లు, బీఆర్‌ఎస్ నుం చి 98, బీజేపీ నుంచి 108, ఆప్ నుంచి 10, బీఎస్పీ నుంచి తొమ్మిది, ఏఐఎంఎం నుంచి రెండు, సీపీఎం నుంచి రెండు, ఇతర పార్టీల నుంచి 44, ఇండిపెండెంట్ల 36 నామినేషన్లు ఆమోదం పొందాయి.

అలాగే బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డులకు 252 మంది అభ్యర్థుల 279 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఇం దులో కాంగ్రెస్ నుంచి 123 నామినేషన్ లు, బీఆర్‌ఎస్ నుంచి 81, బీజేపీ నుంచి 27, బీఎస్పీ నుంచి 10,  ఏఐఎంఎం నుంచి రెం డు, ఇతర పార్టీల నుంచి 15, ఇండిపెండెంట్ల నుంచి 21 నామినేషన్లకు ఆమోదం లభించాయి, చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు 154 మంది అభ్యర్థుల 171 నామినేషన్లు ఆమో దం పొందగా కాంగ్రెస్ నుంచి 56, బీఆర్‌ఎస్ నుంచి 36, బీజేపీ నుంచి 24, ఆప్ నుంచి ఇద్దరు, బీఎస్పీ, సీపీఎంల నుంచి ఒక్కొక్కటి, ఇతర పార్టీల నుంచి 14, ఇండిపెండెంట్లు 37 నామినేషన్లు ఆమో దం పొందాయి.

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డుల కు 193 మంది అభ్యర్థుల 241 నామినేషన్లకు ఆమో దం లభిం చగా కాంగ్రెస్ నుంచి 88, బీఆర్‌ఎస్ నుంచి 53, బీజేపీ నుంచి 33, బీఎస్పీ నుంచి ముగ్గు రు, సీపీఎం నుంచి రెండు, ఇతర పార్టీల నుంచి 29, ఇండిపెండెంట్లు 33 నామినేషన్లు పొం దాయి. అలాగే లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులకు 100 మంది అభ్యర్థుల నుంచి 100 నామినేషన్లు ఆమో దం పొందగా కాంగ్రెస్ నుంచి 25, బీఆర్‌ఎస్ నుంచి 32, బీజేపీ నుంచి 25, బీఎస్పీ నుంచి మూడు, సీపీఎం నుంచి మూడు, ఇతర పార్టీల నుంచి నాలుగు, ఇండిపెండెంట్ల 8 నామినేషన్లకు ఆమోదం లభించాయి. 

బీ ఫారంల కోసం అభ్యర్థుల ప్రదర్శనలు..

జిల్లాలో ఇప్పటి వరకు మంచిర్యాల ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మా త్రమే విలేకరుల సమావేశం పెట్టి మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు లక్షెట్టిపేట మున్సిపాలిటీల కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఈ రెండింటిలో ప్రకటించిన అభ్యర్థులు మినహా మిగితా అందరు ఇండిపెండెంటుల కిందకే రానున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీతో పాటు చెన్నూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీల అభ్యర్థులను ఆయా నియోజక వర్గ ఎంఎల్‌ఏలు ఇంత వరకు ప్రకటించలేదు.

మరో వైపు బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు సైతం అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి ఉంది. పార్టీలన్నింటికి బీ ఫారాలు సమర్పించేందుకు ఈ నెల మూడవ తేదీ వరకు సమ యం ఉండటంతో ఆయా పార్టీలు బీ ఫారా లు అందజేసిన అనంతరం పార్టీ గుర్తులపై పోటీలో ఎంత మంది ఉంటారో, స్వతంత్ర అభ్యర్థులుగా ఎంత మంది బరిలో ఉంటా రో తేలనుంది. పార్టీ అదిష్టానం నుంచి ఖచ్చితమైన హామీ తీసుకున్నవారు ప్రచారం చేసుకుంటుండగా ఇప్పటికీ నామినేషన్లు వేసిన చాలా మంది అభ్యర్థులు ఎంఎల్‌ఏల, పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. 

డివిజన్, వార్డుల ఆధారంగా డిమాండ్..

డివిజన్, వార్డుల్లో పోటీలో ఉంటున్న అభ్యర్థులను విత్ డ్రా చేయించేందుకు కార్పొరేటర్, కౌన్సిలర్ పదవి ఆశిస్తున్న వారు శరవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. డివిజన్, వార్డు ఆధారంగా రేట్లు మాట్లాడుకుంటున్నారు. పార్టీలో సంవత్సరాల తరబడి పని చేసినా గుర్తింపునకు నోచుకొని, పార్టీ రెబల్ అభ్యర్థులను కలిసి విత్ డ్రా చేసుకొని మద్దతు ఇవ్వాలని, ఇప్ప టి వరకు పెట్టిన ఖర్చులతో పాటు గుడ్ విల్ గా ఇన్ని లక్షలు ఇస్తామని, సహకరించాలని వేడుకుంటున్నారు. వీరిలో ఎవరు విత్ డ్రా అవుతారో వేచి చూడాల్సిందే.