02-02-2026 12:00:00 AM
ఓ కార్మికుని మృతి, పలువురికి గాయాలు
ఒకరి పరిస్థితి విషమం
ఆదిలాబాద్, ఫిబ్రవరి 01 (విజయక్రాంతి): జిల్లాలోని జైనథ్ మండలం లోని టైర్‌ల వ్యర్థాల ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడు ఘటనలో ఓ కార్మి కుడు అక్కడికక్కడే దుర్మరణం చెంద గా, పలువురి కార్మికులకు గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్, ఎస్.ఐ గౌతం పవార్ తెలిపిన వివరాల ప్రకారం... మండలం లోని నిరాల గ్రామ సమీపంలో గల టైర్ల వ్యర్థాల ఫ్యాక్టరీలో శనివారం అర్థరాత్రి సమయంలో ఓవర్ కంప్రెసర్ కారణంగా రియాక్టర్ లు పేలడంతో పవన్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8 మంది కార్మికులకు గాయాలయ్యాయి.
అందులో ఉమేష్ అనే కార్మికుని పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకు న్న 108 సిబ్బంది క్షతగాత్రులను రిమ్స్ కు తరలించారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడితో పాటు గాయపడ్డ వారంతా బీహార్ కు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.