calender_icon.png 30 October, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేగంపేట ఐకెపి విద్యుత్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తాం

29-10-2025 07:15:19 PM

విద్యుత్ శాఖ ఏఈ మహేందర్ రెడ్డి..

రామగిరి (విజయక్రాంతి): మండలంలోని బేగంపేటలోని నూతన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో విద్యుత్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని విద్యుత్ శాఖ రామగిరి ఏఈ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు బుధవారం ఐకెపిని సందర్శించారు. నూతన ఐకెపి కేంద్రంలో ఆరు లెవెన్ కేవీ స్తంభాలు ఆరు ఎల్టీ స్తంభాలతో విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల విద్యుత్ శాఖ అధికారులతో పాటు స్థానిక విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.