17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

29-10-2025 07:12 PM

కోదాడ టౌన్ సిఐ కె.శివ శంకర్..

కోదాడ: మొంథా తుఫాన్ ప్రభావం వల్ల ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కోదాడ పరిధిలోని అధికారులు, అన్ని శాఖల అధికారులు గ్రామాలలో పట్టణాలలో ప్రజలు అందుబాటులో ఉండాలని కోదాడ టౌన్ సిఐ కె.శివ శంకర్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ప్రాణనష్టం ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న వాగులు వంకలు, కాలువలు, చెరువులు కుంటలు వద్దకు ఎవరూ కూడా వెళ్లవద్దన్నారు. శిధిలమైన భవనాలలో ఉండవద్దన్నారు. విద్యుత్ వైర్లు ట్రాన్స్ఫార్మర్లు మోటర్లు స్తంభాలను తాకవద్దని ప్రజలకు రైతులకు సూచించారు. అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటికి రావాలని కోదాడ టౌన్ సిఐ కె శివ శంకర్ ప్రజలను కోరారు.