02-12-2025 02:08:47 AM
రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న తాజాచిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. మేకర్స్ సోమవారం రాజమండ్రిలో ఏర్పాటుచేసిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌తో మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభిం చారు. సినిమాలోని ‘బెల్లా బెల్లా’ అనే పాటను ఈ కార్యక్రమంలో విడుదల చేశారు.
ఆకట్టుకునే జానపద బాణీలో భీమ్స్ సిసిరోలియో స్వరపర్చిన ఈ గీతానికి సురేశ్ గంగుల సాహిత్యం అందించగా నకాష్ అజీజ్, రోహిణి సోర్రాట్ ఆలపించారు. ‘బార్సిలోనా బేబి.. మార్స్ నుండి మేబీ.. పుట్టుకొచ్చిందో బీచికి కొట్టుకొచ్చిందో.. నడుమే స్కార్లెట్.. నడాకే విన్స్ లెట్.. ఒళ్లు చూస్తే టేలర్ స్విఫ్ట్.. కళ్లు రెండు తిరిగేటట్టు.. బెల్లాబెల్లా ఇసా బెల్లా.. బాగున్నావే రసగుల్లా.. ఎల్లాఎల్లా స్పైసీ ఇల్లా నింపేశావే నిలువెల్లా..’ అంటూ సాగుతోందీ గీతం.
ఈ పాటలో రవితేజ, ఆషికా రంగనాథ్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ రిఫ్రెషింగ్, ఎలక్ట్రిక్‌గా అనిపిస్తోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటోంది. 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: ప్రసాద్ మురెళ్ల; ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాశ్.