13 July, 2026 | 2:12 AM

బెల్లింగ్‌హామ్ డబుల్ ధమాకా

13-07-2026 01:44 AM

సెమీస్‌కు ఇంగ్లాండ్

మియామి, జూలై 12 : సాకర్ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆ జట్టు స్టార్ మిడ్‌ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ డబుల్ గోల్స్‌తో చెలరేగడంతో క్వార్టర్ ఫైన ల్లో నార్వేను 2 స్కోరుతో చిత్తు చేసింది. మ్యాచ్ 36వ నిమిషంలో నార్వే ఆటగాడు ఆండ్రియాస్ షెల్డెరుప్ లభించిన అవకాశాన్ని అద్భుతంగా మలుచుకుంటూ గోల్ కొట్టాడు. దీంతో నార్వే 1 ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో ఇంగ్లాండ్ క్యాంప్‌లో టెన్ష న్ మొదలైంది.

ఫస్టాఫ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు ఇంగ్లాండ్ స్టార్ జూ డ్ బెల్లింగ్‌హామ్ గోల్ సాధించాడు. దీంతో స్కోరు 1- సమమైంది.సెకండాఫ్‌లో ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించా యి. నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1 సమంగా నిలవ డంతో మ్యాచ్ ఫలితం కోసం ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించారు. బెల్లింగ్‌హామ్ మరో గోల్ కొట్టి ఇంగ్లాండ్‌కు 2 తిరుగులేని విజయాన్ని అందించాడు. సెమీస్‌లో అర్జెంటీనా, ఇంగ్లాండ్ తలపడతాయి.