10 June, 2026 | 1:31 AM

నైట్ క్లబ్‌లో బెన్ స్టోక్స్ రచ్చ

10-06-2026 12:03 AM

చర్యలకు సిద్ధమైన ఈసీబీ 

రిటైర్మెంట్ యోచనలో ఇంగ్లాండ్ కెప్టెన్

లారడ్స్, జూన్ 9: న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో విజయం సాధించిన ఆనందం ఇంగ్లండ్ జట్టుకు ఎక్కువసేపు నిలవలేదు. ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, పేసర్ అట్కిన్సన్తో కలిసి ఫూటుగా మద్యం తాగి అపరిచితులపై దాడి చేసి వీరంగం సృష్టించారు.

జట్టు నిబంధనలను ఉల్లంఘించి అర్ధరాత్రి తర్వాత క్లబ్‌కు వెళ్లిన ఈ ఇద్దరిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చర్యలకు సిద్ధమవుతోంది. ఓ నైట్‌క్లబ్లో ఫుల్లుగా తాగి రగ్బీ ఆటగాడి పై దాడి చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ వివాదంతో బోర్డు చర్యలు తీసుకోకముం దే స్టోక్స్ తన కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అతడు స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పాటు రిటైర్మెంట్ కూడా ప్రకటించవచ్చు.

అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఇదిలా ఉంటే, నైట్క్లబ్ ఘటనలో స్టోక్స్, అట్కిన్సన్ ఎవరిపై దాడికి పాల్పడలేదని ఈసీబీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై చర్యలు తప్పకపోవచ్చు. స్టోక్స్కు ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. గతంలోనూ పీకల దాకా తాగి రచ్చ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి.  గతేడాది నవంబర్లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ఇలాగే నైట్క్లబ్ వివాదంలో చిక్కుకున్నాడు.