టాప్-10లోకి హర్మన్‌ప్రీత్
ఐదో ప్లేస్‌లో స్మృతి మందాన
మహిళల ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
దుబాయి, జూన్ 8: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం ముంగిట ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి దూసుకొచ్చింది. 655 రేటింగ్ పాయింట్లతో 10వ స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో ఆమె అర్ధ శతకం సాధించింది.
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ సోఫీ డివైన్ 650 పాయింట్లతో 11వ స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్ ర్యాం కింగ్స్లో ఆసీస్ ప్లేయర్ జార్జియా వాల్ 815 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ వికెట్ కీపర్ బెత్ మూనీ(788), సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్(786) పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత ప్లేయర్లలో స్మృతి మంధాన(740) ఐదో స్థానంలో నిలిచింది.బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్ ప్లేయర్ లిన్సీ స్మిత్ 727 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
మరో ఇంగ్లండ్ ప్లేయర్ లారెన్ బెల్ 723 పాయింట్లతో రెండో స్థానానికి చేరి పాక్ బౌలర్ సాదియా ఇక్బాల్తో సమానంగా నిలిచింది. భారత స్పిన్నర్ శ్రీచరణి మాత్రం మూడు స్థానాలు కోల్పోయి ఏడో ర్యాంక్కు పడిపోయింది. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమెలియా కెర్ మళ్లీ అంతర్జాతీయ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల ఐర్లాండ్లో జరిగిన ముక్కోణపు సిరీస్ చివరి మ్యాచ్కు వెస్టిండీస్ ప్లేయర్ హీలీ మ్యాథ్యూస్ దూరమైన ఆమె టాప్ ప్లేస్ను కోల్పోయింది.
అమెలియా కెర్ 478 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, మ్యాథ్యూస్ 473 పాయిం ట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే వీరిద్దరి మధ్య తేడా కేవలం ఐదు పాయింట్లే. మరోవైపు స్కాట్లాండ్ ఆల్రౌండర్ కేథరిన్ బ్రేస్ ఐర్లాండ్ ట్రై సిరీస్లో అద్భుత ప్రదర్శనతో ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగబాకి 17వ ర్యాంక్‌కు చేరుకుంది.






