డబ్బులు ఇచ్చినట్లు ఎవరికీ చెప్పకండి
ఆడియో క్లిప్పింగులు వైరల్ కావడంతో లబ్ధిదారులకు నిగ్వ పంచాయతీ కార్యదర్శి ఫోన్లు
సస్పెండ్ చేయాలని లబ్ధిదారుల డిమాండ్
కుభీర్, ఫిబ్రవరి 25 : మండలంలోని నిగ్వ గ్రామ పంచాయతీ కార్యదర్శి సింధుజా ఇందిరమ్మ లబ్ధిదారులైన సోనుబాయి, పుల్లోళ్ళ నందబాయిల నుంచి లొకేషన్ మార్చేందుకుగాను రూ.40 వేలు తీసుకున్నారని లబ్ధిదారు లు ఆరోపించారు.
బుధవారం నిగ్వ గ్రామం లో లబ్ధిదారులు మాట్లాడుతూ.. మొదటి విడతలో భాగంగా తమకు ఇందిరమ్మ ఇల్లు మం జూరు కాగా పాకలాంటి తమ ఇల్లును కూలగొట్టుకొని చదును చేశాము. మార్కోట్ ఇవ్వ డానికి వచ్చిన అధికారులు పంచాయతీ కార్యదర్శి సింధుజా ఆ స్థలం ఇందిరమ్మ ఇంటి కొలతలకి సరిపోడం లేదని మార్కోట్ ఇవ్వరాదని చెప్పి వెళ్లిపోయారు. ఎక్కడైనా స్థలం కొనుక్కోవాలని లేదంటే మంజూరైన ఇల్లు వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పడంతో అప్పులు చేసి గ్రామంలోని ఒక ఖాళీ స్థలంలో ఉన్న ప్లాట్‌ను కొనుగోలు చేశాం.
అక్కడ మార్కోట్ ఇవ్వడానికి నిరాకరించిన పంచాయతీ కార్యదర్శి సింధుజా లొకేషన్ చేంజ్ కోసంపై అధికారులకు డబ్బులు ఇవ్వవలసి ఉంటుందని చెప్పి రూ.20 వేలు ఇస్తేనే మార్కోట్ ఇస్తానని చెప్పడంతో ఆమెకు రూ.20వేలు ఇచ్చామని తెలిపారు. డబ్బులు అడిగి పుచ్చుకున్న ఆడియో క్లిప్పింగులు వైరల్ కావడంతో పీఎస్ సింధుజ లబ్ధిదారులకు ఫోన్లు చేస్తూ.. నా జీతం పోతుంది డబ్బులు ఇచ్చినట్లు ఎవరికీ చెప్పకండి అంటూ ప్రాధేయపడుతు న్నట్లు ఆడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయమై ఎంపీడీవో గంగాసాగర్‌రెడ్డిని వివరణ కోరగా.. సెక్రటరీ సింధుజపై విచారణ జరిపి లంచం తీసుకున్న విషయం నిజమైనట్లు తెలిస్తే ఆమెపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు.




