16-05-2025 12:00:00 AM
నిర్మల్ మే 15 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండల కేంద్రంలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభు త్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులు గురువారం ఆక్రమించుకొన్నారు. గ్రా మంలో అత్యంత నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్లను అందించేందుకు అప్ప టి ప్రభుత్వం 40 ఇళ్లను నిర్మించారు.
ఇండ్ల నిర్మాణం పూర్తయి రెండేళ్లు గడుస్తున్న ఇప్పటివరకు వాటిని పం పిణీ చేయలేదు. అయితే డబ్బులు బెడ్‌రూమ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో అత్యంత నిరుపేద లను అప్పటి ప్రభుత్వం అధికారులు ఎంపిక చేసి లక్కీ డ్రిప్ ద్వారా అర్హులుగా తేల్చి ఇల్లు మంజూరు పత్రాల ను అందించినట్టు వారు పేర్కొంటున్నారు.
డబుల్ బెడ్ రూమ్ నిర్మించిన ప్రదేశంలో మౌలిక సదుపాయాల పేరుతో పనులు చేపట్టకపోవడంతో లబ్ధిదారులకు ఇప్పటివరకు ఇండ్లను కేటాయించకపోవడంతో గురువారం వారంతా అక్కడికి వెళ్లి కొత్త బెడ్ రూమ్ ఇండ్ల తాళాలు పగలగొట్టి ఐళ్ల లో ఉండడంతో ఈ విషయం పోలీసులకు రెవెన్యూ అధికారులకు తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లి సంజయించారు.