15-05-2025 11:44:44 PM
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసి అతని నుంచి యమహా మోటార్ సైకిల్ మూడు సెల్ ఫోన్స్ లను స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ ఎస్ఐ వై సైదులు(Two Town SI Saidulu) చోరీ వివరాలను వెల్లడించారు. ఏపీలోని విజయవాడలో నివాసం ఉంటూ కూలి పని చేసుకునే మహంకాళి చందు అలియాస్ పూరి వరుస దొంగతనాలకు పాల్పడుతూ, టూ టౌన్ పోలీసులు గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ రోడ్డులో పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు.
సిబ్బంది అప్రమత్తమై నేరస్తుని పట్టుకొని అదుపులో తీసుకొని విచారించారు. గతంలో విజయవాడలో ఐదు దొంగతనం కేసులు ఒకటి గంజాయి కేసు ఉందని తేలింది. గత నెల రోజుల క్రితం శ్రీనగర్ కాలనీలోని ఒక ఇంట్లో నేను నా స్నేహితుడు బుడ్డా ఇద్దరం కలిసి దొంగతనం చేశామని ఒప్పుకున్నాడు. డీఎస్పీ కే శివరాం రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ టూ టౌన్ సిఐ రాఘవరావు, పర్యవేక్షణలో కేసు విచారణలో సమర్థవంతంగా పనిచేసిన టూ టౌన్ ఎస్ఐ సైదులు, ట్రైన్ ఎస్సై రాజీవ్, సిబ్బంది ఏఎస్ఐ చంద్రశేఖర్, శ్రీధర్, శంకర్, బాలకోటిలను, డీఎస్పీ అభినందించారు.