calender_icon.png 16 May, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు

16-05-2025 10:01:41 AM

హైదరాబాద్: అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో నేడు, రేపు తెలంగాణలో(Telangana Rains) మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 18 జిల్లాలకు ఐఎండీ(India Meteorological Department) హైదరాబాద్ ఆరెంజ్‌ అలర్ట్‌, మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

శుక్రవారం తెల్లవారుజామునుంచే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో జోరువాన పడింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. మాదాపూర్, కూకట్ పల్లి, చందానగర్, మల్కాజ్ గిరి, కాప్రా తదితర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. గంటన్నర పాటు ఎడతెరిపిలేని వాన, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లంగర్ హౌస్ లో అత్యధికంగా 3 సెం.మీ వర్షం, కార్వాన్ లో 2.3, గోషామహల్ లో 2.2 సెం.మీ వర్షం, ఫలక్ నుమాలో 2.1 సెం.మీ వర్షం