17 April, 2026 | 9:35 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

మాకు దిక్కెవరు?

16-05-2025 12:00 AM
  1. అడ్రస్ లేని మల్లన్నసాగర్ గ్రామాలు
  2. జీతాలు రాక పంచాయతీ కార్మికులు, తీరని గ్రామస్థుల కష్టాలు
  3. విలేకరులతో ఆవేదన వ్యక్తం చేసిన వేములగట్టు గ్రామస్థులు

గజ్వేల్,  మే 15: మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు అడ్రస్ కూడా ఇప్పటివరకు అధికారులు చెప్పడం లేదని, సమస్యల వలయం లో కొట్టుమిట్టాడుతున్న మాకు దిక్కవరం అంటూ మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన వేముల గట్టు గ్రామ ప్రజలు  వ్యక్తం చేశారు. గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలోని వేముల గట్టులో గ్రామ ప్రజలు, పారిశుద్ధ కార్మికులు  గురువారం విలేకరులతో మాట్లాడారు. 

మ ల్లన్న సాగర్‌లో ముంపుకు గురైన  వేముల గట్టు, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, బ్రా హ్మణ బంజరుపల్లి, లక్ష్మాపూర్ గ్రామాలను  తొగుట మండలం నుండి  ప్రభుత్వం తొలగించినట్లు అధికారులు వెల్లడించారని, గజ్వే ల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ ను త మ గ్రామాల గురించి అడగగా, తమకు ప్ర భుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారన్నారు.

అటు తొగుట మండలం నుంచి తొలగించబడి, ఇటు మునిసిపల్ లో విలీనం కాకపోగా ముంపు గ్రామాల అడ్రస్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు.  గ్రామాల్లో పారిశుద్ధ్యం తాగునీరు విద్యుత్ దగ్గర సేవలను అందించడానికి ఇప్పటివరకు విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శులను సైతం జిల్లా అధికారులు  వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేశారని, ఆయా గ్రామాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు పేరుకు మాత్ర మే ఉన్నా వారి ద్వారా ఎలాంటి నిధులు మంజూరు కానీ, పనులు కానీ జరగడంలేదని గ్రామస్తులు వాపోయారు.

పునరావాస గ్రామాలలో  ప్రజల జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేయడానికి అధికారులు ఎవరూ లేకపోవడంతో విద్యార్థుల ఉన్నత చదువులు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు తదితర సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఐదు నెలల నుండి జీతాలు రాక డ్వాక్రా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ ను అడిగిన మంత్రి సంతకం చేస్తే గాని జీతాలు రావటం కరాకండిగా చెప్పేశారని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 

జీతాలు రాక పోవడంతో కుటుంబ భారం మోయలేకపోతున్నామని రోజు గడవడానికి కూడా ఇబ్బం దిగా ఉంది అప్పులు చేయాల్సి వస్తుందని కార్మికుల వ్యక్తం చేశారు.  వెంటనే జిల్లా మంత్రి ఈ విషయంలో కల్పించుకొని మా కు వెంటనే జీతాలు చెల్లించేలా చూడాలని కోరారు. అలాగే గ్రామాలలో పెండింగ్ ఉన్న ప్లాట్లు, ప్యాకేజీలు వెంటనే ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని, కొన్ని ప్లాట్లు చూపించి రిజిస్ట్రేషన్ చేసినా ప్లాట్లు  మాత్రం అప్పగించడం లేదని వెంటనే అప్పగించాలని గ్రామ స్తులు డిమాండ్ చేశారు.

ప్లాట్లు రాని వారం తా గజ్వేల్ పట్టణ ప్రజలకు కేటాయించిన డబుల్ బెడ్ రూంలో ఉండడంతో అక్కడి లబ్ధిదారులకు పునరావాసులకు నిత్యం గొడవలు జరుగుతున్నాయని, పునరావాసుల ప్యాకేజీలు అందిస్తే అన్ని సమస్యలు పరిష్కా రం అవుతాయన్నారు.  ఒంటరి మహిళలు, 65 సంవత్సరాలకు పైబడి ఉన్న వృద్ధులకు కూడా ప్యాకేజీలు ఇవ్వాలని కోర్టు ఆదేశించి నా గతంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో వాటిని నిలిపివేశారని, వెంటనే వాటి ని మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరా రు.

గ్రామాలలో స్మశాన వాటికలు లేకపోవడంతో దహన సంస్కారాలకు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని వెంటనే స్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్ర మంలో  బిఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు లక్ష్మాపూర్ కనకయ్య, నాయకులు కోట బిక్షపతి, పురుషోత్తం రెడ్డి మాల్ పటేల్, జహంగీర్, దాతర్పల్లి నర్సింలు, సిద్దిపేట ఎల్లం, పెద్ది బా లకిషన్,  కనకా గౌడ్, దొడ్ల చందు, పోతుగం టి శీను, గణపురం నరసింహులు, వేముల గట్టు, ఎర్రవల్లి ఎడిగడ్డ కిష్టాపూర్, పల్లె పహా డ్, బ్రాహ్మణ బంజరుపల్లి, లక్ష్మాపూర్  గ్రామాల  కార్మికులు కూడా పాల్గొన్నారు.