1 July, 2026 | 8:11 PM

Breaking News

ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •  

మోడల్ ఇంటిని సందర్శించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు

30-05-2025 12:11 AM

కల్లూరు,మే29 (విజయ క్రాంతి) సత్తుపల్లి నియోజకవర్గం లో 3,500 మంజురు కాగా మం డలాలు వారీగా కేటాయించిగా కల్లూరు మండలం లో 756 కేటాయించిగా 756 మంది అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందరమ్మ ఇళ్ల పట్టాలు అందచేయడం జరుగుతుంది.

మం డలం లో ప్రస్తుతం ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు గురువారం మండలం పరిషత్ కా ర్యలయంలో ఇంటి నమూనా, ప్రామాణికాలు,నిర్దేశికాలను ఎంపీడీఓ చెంద్రశేఖర్ ఆధ్వర్యంలో వివరించండం జరిగింది.తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదల సొంతింటి కలను నెరవేరుస్తోంది.

లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. మధ్యవర్తులు, దళారులు మాటలు నమ్మి మోసపకండి ఎవరికి ఒక్క రూపాయి ఇచ్చే పనిలేదు మొత్తం లబ్ధిదారులు ఖాతాలో జమ చేయబడుతుందని తెలిపారు.

ఎ ఈ మాట్లాడుతూ..

 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు తెలంగాణ సర్కారు పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త ప్పనిసరిగా 400 చదరపు అడుగుల విస్తీర్ణం తగ్గకుండా, 600చదరపు అడుగులు మించ కుండా  ఇల్లు నిర్మాణం చేపడితేనే బిల్లులు చెల్లిస్తారని ,ఇంటి నిర్మాణం చేపట్టే ముందు ఎ ఈ పంచాయితీ కార్యదర్శి కి సమాచారం ఇవ్వాలని,

వారు చూపిన కొలతలు ప్రకారం నిర్మాణం చేపడితేనే బిల్లు లు మంజూరు అవుతాయన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. లబ్ధిదారులకు ఎంపీడీఓ కార్యలయం ప్రాంగణంలో నిర్మించిన ఇందిరమ్మ  నమూనా ఇంటిని ఎంపీడీవో చంద్రశేఖర్,ఎంపీ ఓ రంజిత్, ఏ ఈ ల సమక్షంలో లబ్ధిదారులు తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు పాల్గొన్నారు.