04-05-2024 12:20:00 AM
ఇది పిల్లల వసంత కాలం.. వాళ్ళను ఆటా, పాటాలకు అంకితం చేద్దాం.. కాంక్రీట్ జంగల్‌కు దూరంగా.. ప్రకృతి దగ్గరగా ఎంజాయ్ చేయించడం తల్లిదండ్రుల బాధ్యత. ఒకప్పుడు సెలవులు వచ్చాయంటే చాలు పిల్లలను అమ్మమ్మవాళ్లింటికి.. నానమ్మవాళ్లింటికి పంపించేవాళ్లం. కానీ కాలం మారింది. ప్రస్తుతం అందరు బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో పిల్లలను ఫోన్‌కు, టీవీకి అతుక్కుపోకుండా.. మానసిక, శారీరక ఆనందానికి సమ్మర్ క్యాంపులకు పంపించండి. రంగుల ప్రపంచాన్ని పరిచయం చేయడమే కాదు.. వాళ్ళదైన వాతావరణంలో చక్కగా విహరిస్తారు.
సమ్మర్ క్యాంపు ఉపయోగాలు, నైపుణ్యాలు, డ్యాన్స్‌ల వల్ల కలిగే ఉపయోగాలెంటో ‘ఆటా పాటా’ పేజీలో చూసేయండి! పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ఉపయోగకరమైన సమ్మర్ క్యాంపు ల్లో చిన్నారుల కోసం నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. క్యాంపులో కథలు రాయడం ఎలానో చెప్పి కథల చెప్పించడం, రాయించడం చేస్తుంటారు. పెయిం టింగ్స్, డ్రాయింగ్స్ నేర్పిస్తారు. డ్యాన్స్‌లు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ పెడతారు. మన దేశంలో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. ఆసక్తి గల పిల్లలకు ఆయా విభాగాలలో ముందుగా వాటి గురించి వివరించి, ఆ తర్వాత పోటీలు నిర్వహిస్తారు. పోటీ లు కచ్చితంగా పెట్టకపోయిన జీవితంలో అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తుంటారు. కేవలం క్యాంపుల్లో కళలకే పరిమితం కాకుండా కొన్ని చోట్ల సైన్స్ సంబంధిత కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.
క్యాంపు వల్ల ఉపమోగం?
సమ్మర్ క్యాంప్‌లో పిల్లలకు కొత్త వాతావరణం పరిచయమవుతుంది. కొత్త కొత్త స్నేహితులు పరిచయమవుతారు. వీటి వల్ల పిల్లలు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, పదిమందితో కలవడానికి, కొత్త వాతావరణానికి అలవాటు పడుతుంటా రు. ఈ మధ్య పిల్లల్లో ఆత్మన్యూతభావం, ఒంటరితనం ఎక్కువవుతోంది. ఒంటరితనం దూరం కావ డంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
క్యాంపు ఉద్దేశ్యం
ఒక్కో కార్యక్రమానికి ఒక్కో ఉద్దేశ్యం ఉంటుం ది. అలానే డ్రాయింగ్, పెయింటింగ్, డ్యాన్స్, కథలు రాయడం, చదవడం, గ్రూప్ డిస్కషన్, నాటకాలు ఇవన్నీ కూడా సృజనాత్మకత జ్ఞానాన్ని పెంపొందిస్తాయి.
డ్రాయింగ్ అండ్ పెయింటింగ్
డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అనేవి చిన్నారుల పర్సనల్ డెవలప్‌మెంట్‌కు తోడ్పడతాయి. వీటి ద్వారా భావ వ్యక్తీకరణ చేయడం ఎలాగో తెలుసుకుంటారు. కెరీర్‌లో తమకు ఇష్టమైన రంగంలో రాణించడానికి చాలా దోహదపడతాయి. మానసిక ప్రశాంతతకు, సృజనత్మాకతను పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
నృత్యం
డ్యాన్స్ వల్ల ఊపిరితిత్తుల, గుండె పరిస్థితి మెరుగుపడుతుంది. కండరాల శక్తిలో మార్పు వస్తుంది. సమన్వయ ధోరణి, ఓపిక పెరుగుతుంది. భయపడే గుణం దూరమై పది మందిలో కలిసి పోతారు. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతుం ది. ఎటువంటి పరిస్థితుల నుంచైన గట్టెక్కే విధంగా తమను తాము మోటివేట్ చేసుకునే శక్తి వస్తుంది. మానసిక సామర్థ్యం మెరుగుపడుతుంది. మెరుగైన సామాజిక నైపుణ్యాలు అలవడుతాయి.
కథలు
ప్రపంచంలో ప్రభావవంతమైన వాటిలో కథలు ముందుంటాయి. కథలు చదవడం వల్ల భాష మీద పట్టు ఏర్పడుతుంది. పదాల అర్థాలు తెలుస్తాయి, ఊహా శక్తి పెరుగుతుంది. కథలు రాయడం వల్ల ఎలా తమ భావాలను తెలియజేయాలో తెలుస్తుంది. ఒక క్రమ పద్ధతిలో అర్థమై య్యే తీరులో భావాలను, తమ అనుభవాలను తెలియజేస్తారు. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. పిల్లలు తాము రాసిన కథలు లేదా రచయితలు రాసిన కథలు చెప్పడం వల్ల ఉచ్ఛారణ మెరుగుపడుతుంది. కథల వల్ల ఏది మంచి, ఏది చెడు, ఏది నైతికత, ఏది అనైతికత అనేది తెలుస్తుంది.
గ్రూప్ డిస్కషన్
పదిమందిలో ఉన్నప్పుడు విని ఎలా స్పందించాలో గ్రూప్ డిస్కషన్స్ వల్ల పిల్లలకు తెలుస్తుంది. ప్రశ్నలను అడగడం ఇంకా తమకు తెలిసిన విషయాలను పంచుకోవడం వల్ల జ్ఞానంపెరుగుతుంది. పిల్లల్లో గ్రూప్ డిస్కషన్ వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అంతేకాకుండా ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకో వాలో తెలుస్తుంది. సమ్మర్ క్యాంప్‌లలో ఈ కార్యక్రమాలకే పరిమితం కాకుండా చాలా విషయాలు నేర్పుతారు. నిత్య జీవితంలో అవసర మైన నైపుణ్యాలు, సవాళ్లను ఎదుర్కొనే శక్తిని ఎలా అలవరుచుకోవాలో చెప్తారు. వాటి వల్ల పిల్లలలోని ఆత్మనూన్యతా భావం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
సయ్యద్ ముజాహిద్ అలీ
ప్రస్తుతం సమాజంలో పిల్లలకు జీవితంలో స్థిరంగా, ధైర్యంగా దేన్నైనా తట్టుకుని నిలబడే విధంగా వ్యక్తిత్వా న్ని, ఆలోచనను ఇచ్చేటటువంటి ఒక వేదిక కావాలి. అలాంటి వేదికలే ఈ సమ్మర్ క్యాంపులు. పాఠశాలలో నేర్పనివి జీవితానికి అవసరమైన విషయలను, కళలను నేర్పే కేంద్రాలు సమ్మర్ క్యాంపులు వెలిశాయి. ఇవి చిన్నారుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి తోడ్పడతాయి. మానసిక ఎదుగుదలకు, కలుపుగోలు తనానికి దోహదపడతాయి.
డాక్టర్ వీ.ఆర్ శర్మ రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్, బాలసాహితీ వేత్త
మానసిక ఆరోగ్యం, శారీరక ఆరో గ్యం, సామాజిక ఆరోగ్య సమన్వయంతో పిల్లలు చక్కగా పెరగడానికి వేస వి శిబిరాల వల్ల ఆస్కా రం ఉంటుంది. దీంతో భవిష్యత్తులో ఆరోగ్యపూరిత సమాజాన్ని నిర్మించిన వాళ్లమ వుతాం. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఎంపిక చేసుకొని పిల్లల వికాసానికి ఉపయోగపడే సమ్మర్ క్యాంప్‌లకు పంపిస్తే పిల్లల అభివృద్ధికి కారకులవుతారు.
శాంతారావు, రచయిత, కవి
సమ్మర్ క్యాంపు ఉపయోగం ఏంటంటే.. వేసవి సెలవుల్లో పిల్లలు ఇంట్లో ఉండి టీవీ, ఫోన్‌కు అతుక్కుపోకుండా.. సోషలైజేషన్ కు ఉపయోగపడేందుకు సమ్మర్ క్యాంపు ముఖ్య ఉద్దేశ్యం. సమ్మర్ క్యాంపుల్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక విధంగా ఈ సీజన్ పిల్లల వసంత కాలంగా చెప్పుకోవచ్చు. క్యాంపులో పిల్లలకు కొత్త వాతావ రణం, కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతా యి. దాని వల్ల పిల్లల్లో కమ్యూనికేషన్ సిల్క్స్ పెరుగుతాయి. ఈ సమ్మర్ క్యాంపు ల్లో సంవత్సరమంతా ఉండే ఎకడామిక్స్ మాత్రమే కాకుండా ఎక్స్‌రా కార్క్యులర్ యాక్టివిటీస్ నేర్చుకుంటారు. ఆర్ట్ అండ్ క్రాప్ట్స్‌తో పాటు డ్యాన్స్ నేర్పిస్తుంటాం. ముఖ్యంగా మా స్కూల్లో అయితే యోగా, శ్లోకాలు నేర్పిస్తున్నాం. క్రీడలు, డ్యాన్స్, యాక్టివిటీస్ అనేవి పిల్లల మానసిక, శారీరక ఉల్లాసానికి, ఎదుగుదలకు సహయపడతాయి.
శ్రీరాజ్యలక్ష్మి, డైరెక్టర్ ఐరిష్ ఫ్లోరెట్స్ స్కూల్, తార్నాక