మెరుగైన వైద్య సేవలు అందించాలి
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల, జూన్21(విజయక్రాంతి): రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖాన ఆవరణను పరిశీలించి, మెడికల్ ఆఫీసర్‌కు పలు సూచనలు చేశారు. ఈడీడీ రిజిస్టర్‌ను పరిశీలించారు. అవసరమైన మందులు సరిపడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.
వరాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్ వేణుమాధవ్, తహసీల్దార్ విజయ్‌ప్రకాష్ ఉన్నారు. అనంతరం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రెండో బైపాస్ రహదారి సమీపంలో ఉన్న జిల్లా వైద్య కళాశా లను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సందరించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపాల్ చంద్రశేఖర్‌కు సూచించారు. అనంతరం కలెక్టరేట్‌లో రహదారులు, భవనాల శాఖ అధికారులతో సమీక్ష నిరహించారు.






