9 May, 2026 | 9:43 AM

రోగులకు మెరుగైన సేవలందించాలి

23-06-2024 12:07 AM
  1. మంత్రి దామోదర రాజనర్సింహ
  2. పుప్పాలగూడలో డాక్టర్ గౌడ్స్ డెంటల్ ఆసుపత్రి ప్రారంభం

రాజేంద్రనగర్, జూన్ 22 (విజయక్రాంతి): అత్యాధునిక డెంటల్ కేర్‌కు ప్రసిద్ధి చెందిన డాక్టర్ గౌడ్స్ డెంటల్ ఆసుపత్రి సేవలను మరింత విస్తృత పరచడం సంతోషంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజలకు నాణ్య మైన దంత చికిత్సను అందించడంలో డాక్టర్ గౌడ్స్ ఆసుపత్రి ముందు వరుసలో ఉందని వ్యాఖ్యానించారు. శనివారం పుప్పాలగూడలో డాక్టర్ గౌడ్స్ డెంటల్ ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన సేవలు అందిం చాలని నిర్వాహకులకు సూచించారు. ఈ ఆసుపత్రికి సుమారు 55 ఏళ్ల చరిత్ర ఉందని, 1967 నుంచి నిర్విరామంగా సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

అనం తరం హాస్పిటల్ వ్యవస్థాపకులు, సీఎండీ ఎంఎస్ గౌడ్ మాట్లాడుతూ.. నగరంలో ఈ ఆసుపత్రి ఆరవది అని తెలిపారు. కోఠి, సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చి బౌలిలో డాక్టర్ గౌడ్స్ డెంటల్ ఆసుపత్రులు ఉన్నాయని వెల్లడించారు. ఈ ఆసుపత్రి ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సమకాలీన, అధునాతన దంత సంరక్షణ సేవలు అందిస్తుందని తెలిపారు. అత్యంత అనుభవజ్ఞులైన దంత వైద్య నిపుణులను కలిగి ఉండ టం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ చీఫ్ కాస్మొటిక్ డెంటల్ ఇంప్లాంటాలజిస్ట్, ఓరల్, మాక్సిల్లో ఫేషియల్ ప్రోస్టోడాం టిస్ట్ డైరెక్టర్ డా.శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.