9 May, 2026 | 8:54 AM

ట్రాన్స్‌కో ఉద్యోగులకు తీపికబురు 3శాతం డీఏ పెంపు

23-06-2024 12:14 AM

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తెలంగాణ ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డీఏను విడుదల చేసింది. ఈమేరకు తెలంగాణ ట్రాన్స్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌ఏఎం రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 2023 నుంచి మే 2024 మధ్యకాలానికి చెల్లించాల్సిన డీఏ 2024 జనవరి1 నుంచి వర్తింపజేస్తామని పేర్కొన్నారు. జూలై 1న అందుకునే వేతనంలో ఈ డీఏను కలిపి చెల్లిస్తామన్నారు. గతంలో డీఏ 8.77 శాతంగా ఉండగా తాజాగా 11.78 శాతానికి పెరింగింది.