దోమ కాటుపై జాగ్రత్త
కేర్ ఆస్పత్రి వైద్యుల హెచ్చరిక
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ప్రపంచ దోమల దినోత్సవం (ఆగస్టు 20) సందర్భంగా కేర్ హాస్పిటల్స్ వైద్యులు ప్రజలను అప్రమత్తం చేశారు. డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. జ్వరం వచ్చినప్పుడు సాధారణ వైరల్ ఫీవర్గా భావించి ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని తెలిపారు. వర్షాలు తగ్గిన తర్వాత కూడా దోమ ల వృద్ధి కొనసాగుతుందని, ఏడాది పొడవునా నివారణ చర్యలు పాటించాలని సూచించారు.
కేర్ హాస్పిటల్స్ మలక్పేట సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సయ్యద్ ముస్తఫా అష్రఫ్ మాట్లాడుతూ.. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ మెడి సిన్ డాక్టర్ చైతన్య చల్లా మాట్లాడుతూ.. కూ లర్లు, పూలకుండీల ట్రేలు, బకెట్లు, పాత టైర్లు, నీటి ట్యాంకుల్లో కొద్దిపాటి నీరు నిలిచినా దోమలు వృద్ధి చెందుతాయని తెలిపారు. వారానికి ఒకసారి ఇంటి పరిసరాలను పరిశీలించి నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. జ్వరం తగ్గకపోవడం, తీవ్రమైన నీరసం, పదేపదే వాంతులు, కడుపునొప్పి, రక్తస్రావం, మగత, శ్వాస తీసుకో వడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కేర్ వైద్యులు తెలిపారు.






