15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భద్రాద్రి జిల్లాకు రెండు రజత పతకాలు

23-02-2026 12:01 AM

భద్రాచలం, ఫిబ్రవరి 22  (విజయక్రాంతి): సీఎం కప్ సెకండ్ ఎడిషన్లో భాగంగా   హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇద్దరూ క్రీడాకారిణిలు రజిత పతకాలు సాధించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ జివి రామిరెడ్డి తెలిపారు. 57 కేజీల విభాగంలో బట్టు శ్వేత  కు  రజిత పతకం,  76 కేజీల విభాగంలో  కంబాల అక్షిత కు రజిత పతకం, సాధించినట్లు తెలిపారు. ఈ గెలుపొందిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి మల్లేష్,

జిల్లా అసోసియేషన్  అధ్యక్షులు భోగాల శ్రీనివాస రెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ, జీవి రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్  కోశాధికారి మహంతి లు అభినందనలు తెలియజేశారు. వీరితోపాటు వెంకటకృష్ణాజి,, జాయింట్ సెక్రెటరీ  గుగులోతు శోభన్ నాయక్, కావేటి రమేష్, మరియు పట్టణ ప్రముఖులు, పలు క్రీడా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, గ్రీన్ భద్రాద్రి సభ్యులు, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ లోని  వివిధ రకాల హోదాలో ఉన్న సభ్యులందరూ కూడా  అభినందించడం జరిగింది.