17 July, 2026 | 8:52 PM

Breaking News

సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •  

భక్తజన సంద్రం కొండగట్టు

02-06-2024 02:59 AM
  • అంజన్న క్షేత్రానికి కదిలిన కాషాయ దండు

హనుమయ్య దర్శానినికి 

రెండు లక్షలకుపైగా భక్తులు

జగిత్యాల, జూన్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలోనే ప్రముఖ క్షేత్రం కొండగట్టు కాషాయమయమైంది. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భక్తజన సంద్రమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి హను మాన్ మాలధారణ చేసిన రెండు లక్షలకుపైగా భక్తులు వచ్చారు. శుక్రవారం రాత్రి నుంచే భక్తులు తరలిరావడంతో శనివారం ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 41 రోజుల పాటు కఠోరదీక్ష పాటించిన భక్తులు ఇరుముడితో తరలివచ్చి కొండగట్టు అంజన్నను దరించుకొని పునీతులయ్యారు. జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా పర్య వేక్షణలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆధర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశా రు. శనివారం తెల్లవారుజామునే అర్చకులు అత్యంత వైభవంగా హనుమాన్ జయంత్యుత్సవాలను ఘనంగా నిరహించారు. తద నంతరం హనుమాను దీక్షపరులు దీక్ష విరమణ చేయించారు.