2 April, 2026 | 2:13 PM

Breaking News

హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులతో బందోబస్తు   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   ప్రజా పాలన వార్డు సభలో ప్రజల ఆగ్రహం   •   రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి.. రూ.5 లక్షల బీమా పథకం   •  

భళా తిలక్

30-01-2025 12:27 AM

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం lటాప్ వరుణ్ చక్రవర్తి 

దుబాయ్: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో భారత స్టార్ ఆటగాళ్లు తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి అదరగొట్టారు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ నంబూ రి తిలక్ వర్మ (832 పాయింట్లు) బ్యాటింగ్ విభాగంలో రెండో స్థానానికి చేరుకోగా.. బౌలింగ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (679 పాయింట్లు) ఏకంగా 25 స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచి కెరీర్ బెస్ట్ అందుకున్నాడు.

బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ అభిషేక్ శర్మ 59 స్థానాలు ఎగబాకి 40వ స్థానంలో నిలవగా.. ఇంగ్లండ్ బ్యాటర్లు లియామ్ లివింగ్‌స్టోన్ 32వ స్థానంలో, బెన్ డకెట్ 28 స్థానాలు ఎగబాకి 68వ స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు) కొనసాగుతున్నాడు.

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ (718 పాయింట్లు) టాప్ స్థానాన్ని నిలుపుకోగా.. విండీస్ బౌలర్ అకిల్ హొసెన్, లంక స్పిన్నర్ హసరంగ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా తొలి స్థానం నిలుపుకున్నాడు.

టార్గెట్ నంబర్‌వన్..

ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్న తిలక్ వర్మకు నంబర్‌వన్ ర్యాంకు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తిలక్ రాణిస్తే  మాత్రం హెడ్‌ను దాటి అగ్రస్థానం అందుకునే చాన్స్ ఉంటుంది. ఇక తిలక్ వర్మ (832 పాయింట్లు) టీ20 క్రికెట్‌లో భారత తరఫున అత్యధిక రేటింగ్ సాధించిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. సూర్య, విరాట్, రాహుల్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. టెస్టుల్లో బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా నంబర్‌వన్ స్థానంలోనే కొనసాగుతున్నాడు.