23 May, 2026 | 2:39 AM

రెండో రౌండ్‌కు శ్రీకాంత్

30-01-2025 12:22 AM

థాయ్‌లాండ్ మాస్టర్స్

పటుమ్వాన్ (థాయ్‌లాండ్): కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతోన్న భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ థాయ్‌లాండ్ మాస్టర్స్‌లో శుభారంభం చేశాడు. బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టోర్నీలో శ్రీకాంత్ రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21 21 ఇజ్రాయెల్‌కు చెందిన డాని దుబొవెంకోను ఓడించాడు.

తర్వాతి రౌండ్‌లో శ్రీకాంత్ హాంగ్ కాంగ్‌కు చెందిన జాసన్ గునావన్‌ను ఎదుర్కోనున్నాడు. మిగిలిన సింగిల్స్‌లో శం కర్ ముత్తుస్వామి, ఆయుశ్ శెట్టి ముందంజ వేయగా.. మిథున్ మంజునాథ్ ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్‌లో రూబెన్ కుమార్ జోడీ రెండో రౌండ్‌కు చేరుకోగా.. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ జంట థాయ్‌లాండ్ జోడీపై విజయం తో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది.