18-11-2024 12:00:00 AM
విడిపోయిన అన్నదమ్ముల కథే ‘భలే తమ్ముడు’
విడిపోయిన ఇద్దరు కవల సోదరులు.. ఆ తరువాత కాలంలో ఒకరు పరిస్థితుల ప్రభావంతో దొంగగానూ.. మరొకరు గాయకుడిగానూ మారు తారు. పోలీసులు ఒకసారి దొంగను బంధించి ఆ స్థానం లో గాయకుడికి స్పెషల్ పవర్స్ ఇచ్చి దొంగల స్థావ రంలోకి ప్రవేశపెడతారు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? వంటి ఆసక్తికర సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందింది. తర్వాత కాలంలో వచ్చి న డాన్ (తెలుగులో యుగంధర్) ఇదే ఇతివృత్తం తో రూపొందింది. ఈ చిత్రంలోని పాట లన్నీ జనాల మనసులో నాటు కు పోయాయి.