23-01-2026 01:40:25 PM
హైదరాబాద్: ఖమ్మం మిర్చి మార్కెట్(Khammam Chilli Market)లో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చికి మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ లో జెండా పాట కంటే తక్షువ ధరకు వ్యాపారులు కొనుగోళ్లు చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఛైర్మన్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.