calender_icon.png 23 January, 2026 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ నేతలకు భయం ఎందుకు?

23-01-2026 01:54:31 PM

కేటీఆర్ ది ఆరిపోయే దీపం

హైదరాబాద్: అవినీతి చేయనప్పుడు బీఆర్ఎస్(BRS) నేతలకు భయం ఎందుకు? అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) ప్రశ్నించారు. కవిత అడుగుతున్న ప్రశ్నలకు కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మీది స్టూవర్ట్ పురం దొంగల బ్యాచ్ అన్నారు. ఇదే పోలీసులు మీ ప్రభుత్వంలో పనిచేస్తే తొత్తులుగా కనిపించలేదా? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని బీఆర్ఎస్ నాటకాలు ఆడుతోందని మహేష్ గౌడ్ ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే బీఆర్ఎస్ నేతలు జైల్లో ఉండేవారని తెలిపారు. కేటీఆర్ ది ఆరిపోయే దీపం అన్నారు. మీ బ్యాచ్ కార్తీకదీపం సీరియల్ పాటలు పాడుకోవాలని ఎద్దేవా చేశారు.