23-01-2026 01:32:10 PM
సుల్తానాబాద్, జనవరి 23 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుళ్ళ మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను శుక్రవారం పెద్దపల్లి ఆర్డిఓ గంగయ్య పరిశీలించారు. జాతర జరుగు ప్రదేశాన్ని కలియ తిరుగుతూ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావడం జరుగుతుందని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ నిర్వహణ ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు.
త్రాగునీరు ,విద్యుత్ లైట్లు, భక్తులకు వసతులు, స్థాన ఘట్టాలు, క్యూలైన్ ద్వారా మోక్కులను చెక్కిలించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జాతర జరిగే ప్రాంతంలో అన్ని విభాగాల అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమం లో తాసిల్దార్ బషీరుద్దీన్, ఎస్ఐ చంద్రకుమార్, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్, ఈఓ శంకరయ్య , సర్పంచ్ కాంపల్లి సతీష్, ఆర్ఐ వినోద్ ,కార్యదర్శి సునీత, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ రెడ్డి, జిపిఓ శ్రీనివాస్ జాతర కమిటీ సభ్యులు, తదితరులున్నారు....