calender_icon.png 23 January, 2026 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భిక్కనూర్‌లో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

23-01-2026 02:25:25 PM

కామారెడ్డి అర్బన్, జనవరి 23(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భిక్కనూర్ ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహానుభావుడు నేతాజీ అని కొనియాడారు. యువత నేతాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. నేతాజీ త్యాగాలు, దేశభక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.