18 April, 2026 | 3:21 PM

జూలైలో వస్తున్న భామ.. రామ

20-06-2025 12:10 AM

సుహాస్ కథానాయకుడిగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళం చిత్రం ‘జో’ ఫేమ్ మాళవిక మనోజ్ ఈ సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీశ్ నల్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని స్పిరిట్ మీడియా విడుదల చేయనుంది.

ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి స్పందన దక్కించుకుందీ చిత్రం. ఈ చిత్రాన్ని జూలై11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: రథన్; సినిమాటోగ్రఫీ: ఎస్ మణికందన్; ఆర్ట్: బ్రహ్మ కడలి; ఎడిటర్: భవిన్ ఎం షా.