calender_icon.png 11 January, 2026 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భరత్ చంద్ర కుటుంబానికి ఇంటి పట్టా అందజేత

07-01-2026 12:00:00 AM

సంస్థాన్ నారాయణపూర్, జనవరి 6 (విజయక్రాంతి): మండలంలోని శేరిగూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్ర అనే విద్యార్థి కుటుంబానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు 200 గజాల ఇంటి పట్టాను మంగళవారం అందజేశారు. గతంలో చదువు పూర్తయ్యే వరకు దత్తత తీసుకొని చదివిస్తానని, ఇంటి స్థలాన్ని కేటాయిస్తానని ఇచ్చిన హామీ మేరకు అతని కుటుంబానికి ఇంటి పట్టాను అందజేశారు.

మూడు నెలలకు సరిపడా సరుకులతో పాటు 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఎలాంటి సమస్య ఉన్నా తనకు తెలియజేయాలని భరత్ చంద్ర లక్ష్యం పూర్తయ్యేవరకు తాను అండగా ఉంటానని అన్నారు. భరత్ చంద్ర కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని  స్థానిక ఎంపీడీవోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శేఖర్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపిడిఓ ప్రమోద్ కుమార్, ఎస్త్స్ర జగన్, తదితరులు పాల్గొన్నారు.