calender_icon.png 11 January, 2026 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్‌కు జీపీ కార్యదర్శుల కృతజ్ఞతలు

07-01-2026 12:00:00 AM

ఖమ్మం, జనవరి6(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కల నెరవేరింది. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 65 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ 4 రెగ్యులర్ ఉత్తర్వులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్ శ్రీజ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా పంచా యతీ కార్యదర్శుల ఫోరమ్ నాయకులు కలెక్ట ర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

నిబంధనల ప్రకారం అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు అందేలా చొరవ చూపినందుకు కలెక్టర్‌కు, అడిషనల్ కలెక్టర్‌కు జిల్లా పంచాయతీ అధికారిరే ధన్యవాదాలు తెలిపారు. తమ ఉద్యోగ భద్రత కోసం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూ, ఈ ఉత్తర్వులు వచ్చేలా అండగా నిలిచిన ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్‌కు, టీజీఈజేఏసీ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కలెక్టర్‌ను కలిసిన వారిలో పంచాయతీ సెక్రటరీ సెంట్రల్ ఫోర మ్ రాష్ట్ర కార్యదర్శి పి వెంకటరమణ, జిల్లా అధ్యక్షులు ఎండీ ఫజల్, ట్రెజరర్ వినోద్, ఖమ్మం జిల్లా టీఎన్జీవో బాధ్యులు వల్లపు వెంకన్న, ప్రభాకరాచారి, అస్లాం, రుక్మారావు, శంకర్, నాగేశ్వరరావు ఉన్నారు.