17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

06-04-2025 06:01 PM

బాన్సువాడ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ బాన్సువాడ పార్టీ కార్యాలయంలో ఆదివారం బిజెపి 45వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో బిజెపి జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది.

నాటి నుండి నేటి వరకు Nation First - Party Second- Self Last అనే నినాదంతో ముందుకు వెళ్ళుతూ అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆధారంగా పనిచేస్తూ, పార్టీ 2 ఎంపీ సీట్లతో ప్రారంభమై, నేడు 15 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నామంటే, కోట్లలాది మంది కార్యకర్తల నిబద్ధత, జాతీయభావం కారణంగా.. పార్టీకోసం తమ జీవితాలను త్యాగం చేసిన నాయకులు, కార్యకర్తలందరినీ స్మరణ చేసుకుంటూ కార్యకర్తలందరికీ "పార్టీ ఆవిర్భావ దినోత్సవ" శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ మాజీ అసెంబ్లీ కన్వీన ర్ చీదర్ సాయిలు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ బిజెపి సీనియర్ నాయకులు ర్యాల మోహన్ రెడ్డి బునపురం విఠల్ రెడ్డి కొనల గంగారెడ్డి చిరంజీవి పాశం భాస్కర్ రెడ్డి శ్రీకాంత్ అశ్విన్ భూమేష్ సాయి సిద్ధార్థ రామకృష్ణ కొండని గంగారం శంకర్ సిద్ది బాలరాజ్ సుధాకర్ గుడుగుట్ల అనిల్ సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.